ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల వైసిపి ముఖ్య నేత వైవి సుబ్బారెడ్డి సవాళ్లు ను షర్మిల స్వీకరించారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ…గత నాలుగేళ్లలో వైసిపి ప్రభుత్వం పాలనలో చేసిన అభివృద్ధి చూడడానికి తాను సిద్ధమని, ‘డేట్ ,టైం మీరు చెప్పిన మమ్మల్ని చెప్పమన్నా సరే అభివృద్ధి పనులు ఎక్కడ చేశారో చూపించండి, నేను మీడియాను తీసుకొస్తా అని సవాల్ విసిరారు. గత నాలుగేళ్ల పరిపాలనలో రాజధాని లేకుండా పాలించిన ప్రభుత్వం వైసీపీదే అని షర్మిల మాట్లాడారు. ఒక్క మెట్రో కూడా లేదంటే పరిస్థితి ఎలా ఉందో తెలిసిపోతుందని మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుంటే వైసీపీ నేతలు ఫీలవుతున్నారని అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి అని పిలిస్తే మీకు ఇబ్బందిగా ఉంటే ఇప్పటినుండి జగన్ అన్న అని పిలుస్తా అని మాట్లాడారు. వైసిపి ముఖ్య నేత వైవి సుబ్బారెడ్డి షర్మిల అన్న మాటలకి కౌంటర్ ఇచ్చాడు. షర్మిల కు ఏం తెలుసు రాష్ట్ర అభివృద్ధి గురించి, మా మాతో పాటు వస్తే రాష్ట్రంలో అభివృద్ధిని చూపిస్తము అన్నారు. సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కు వారసులేవరో చెప్తారు అని అన్నారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వచ్చిందని అన్నారు. సుబ్బారెడ్డి అన్న మాటలకి రియాక్ట్ అయ్యి సీరియస్ గా కామెంట్స్ చేశారు.