ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే ఎంసెట్ అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. అనంతపురం జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలను నిర్వహించారు.ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో 1,73,572 మంది విద్యార్థులు అర్హత సాధించారని అన్నారు.అగ్రికల్చర్ స్ట్రీమ్ లో 83,411 మంది అర్హత సాధించారని, 40 మార్కులను అర్హత మార్కుగా నిర్ధారించామన్నారు బొత్స.ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం పరీక్షకు హాజరైన అందరినీ క్వాలిఫై అయినట్లే పరిగణించామన్నారు.
గతంలో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ ఉండేదని కానీ కోవిడ్ కారణంగా గత ఏడాది పరీక్షలు లేకపోవడంతో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ ఇవ్వలేదన్నారు.ఈ ఏడాది ఏపీ ఈఏపీ సెట్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే అర్హత నిర్ధారించామని తెలిపారు.”ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 89.12 శాతం మంది క్వాలిఫై అయ్యారు.అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 95.06 శాతం మంది క్వాలిఫై అయ్యారు.గత ఏడాదితో పోల్చుకుంటే రెండు స్ట్రీమ్‌లలోనూ పెరిగిన క్వాలిఫైయింగ్ శాతం. ఇంజనీరింగ్ ఫలితాల్లో వెనుకబడిన అమ్మాయిలు. టాప్ టెన్ లో ఒక్క స్థానంలో కూడా చోటు దక్కించుకోని అమ్మాయిలు.
టాప్ స్థానాలు దక్కించుకున్న తెలంగాణ విద్యార్థులు. మొదటి ర్యాంకర్ బోయ హరేన్ సాత్విక్160 మార్కులకు గాను 158.62 మార్కులు సాధించారు. శ్రీ సత్య సాయి జిల్లాకు చెందిన సాత్విక్ రెండో ర్యాంకర్ లక్ష్మీ సాయి లోహిత్ రెడ్డి160 మార్కులకు గాను 158.55 మార్కులు సాధించాడు. హిమ వంశీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన హిమ వంశీ అగ్రికల్చల్లో మొదటి ర్యాంకర్.