ఉచిత హామీలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఉచిత ఎన్నికల హామీలకు సంబంధించిన నిబంధనలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఉన్నాయని, ఉచిత హామీలపై నిషేధం విధించే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వమే తీసుకురావాల్సి ఉంటుందని ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవ్యాధి కోర్టులో ఫిర్యాదు చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చే హామీలు కచ్చితంగా జరుగుతాయని ఇచ్చే వాగ్ధానాలు కాదన్నారు.
ఉచిత హామీలపై ఎలక్షన్ కమిషనే నిర్ణయం తీసుకోవాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం.నటరాజ్ అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు ఎలాంటి అధికారం లేదని, ఈసీనే నిర్ణయం తీసుకోవాలని లిఖితపూర్వకమైన నివేదిక ఇవ్వాలని సీజేఐ ఎన్‌వీ రమణ తెలిపారు. ఉచిత హామీలపై ప్రభుత్వం తన నిర్ణయం చెబితే.. దాన్ని బట్టి వాటిని కొనసాగించాలా? లేదా? అనేది నిర్ణయిస్తామని తీర్పునిచ్చారు.