రాజమండ్రి నుండి పోలవరం బయలుదేరిన సిపిఐ ప్రతినిధి బృందం

-

ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నేతృత్వంలోని బృందం రాజమండ్రి నుండి పోలవరం బయలుదేరింది. ఈ నేపథ్యంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని రకాల ప్రజలు పోలవరం నిర్మాణం విషయంలో ఆందోళన చెందుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రకటనలు గందరగోళానికి గురి చేస్తున్నాయని మండిపడ్డారు రామకృష్ణ. ప్రభుత్వ నిర్లక్ష్యానికి కొంతమంది విలీన ప్రజలు మళ్లీ తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.

ఇతర పార్టీలతో చర్చించి, ప్రాజెక్టుపై అన్ని విషయాలు పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు రామకృష్ణ. రెండు లక్షల నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో అందరికీ న్యాయం జరగాలన్నారు. వైసిపి, బిజెపి, జనసేన పార్టీలు కూడా కలిసి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టుకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. ప్రాజెక్టు 150 అడుగుల ఎత్తులో నిర్మాణం జరగాలని డిమాండ్ చేశారు. జాతీయ ప్రాజెక్టుని గందరగోళం చేయవద్దని జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామన్నారు రామకృష్ణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version