పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై మాజీ మంత్రి దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఎన్టీఆర్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం సందర్శనకు మళ్ళీ వెళతా.. ఈ జగన్ ప్రభుత్వం సంగతి తేలుస్తా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైలవరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
రూ. 81 కోట్లతో కట్టిన గైడ్ బండ్ కుంగితే సెంట్రల్ వాటర్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వమని కోరిందన్నారు. కానీ జగన్ ప్రభుత్వం నీళ్లు నమ్ములుతోందని దుయ్యబట్టారు. రివర్స్ టెండర్ డ్రామాలో జగన్ రెడ్డి కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు. పోలవరం డ్యాం ను నట్టేట ముంచేశారని అన్నారు. పోలవరం పాపాలన్నింటికీ జగన్ రెడ్డి నిర్ణయాలే కారణమని ఆరోపించారు.