హే కృష్ణా… పుష్కరా… దేవినేని ఉమ రెడీనా?

-

గత ప్రభుత్వ హయాంలో అవినీతి పనులు, అక్రమ కార్యక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రులు, నేతలపై ఏపీ ప్రభుత్వం పక్కా స్కెచ్ లతో ముందుకు వెళ్తుంది. ముందుగా మెల్లిగా ఒక కమిటీ వేయడం.. అనంతరం విజలెన్స్ విచారణ.. నెక్స్ట్ అవినీతి నిరోధక శాఖ ఎంట్రీ.. ఫైనల్ గా శ్రీకృష్ణ జన్మస్థానం!! ఈ విధంగా జగన్ సర్కార్ అవినీతిపై ఉక్కుపాదం మోప నిర్ణయించుకున్నట్లుగా ఉంది! అందులో భాగంగా కృష్ణాపుష్కరాలలో జరిగిన అవినీతి విషయంలో నెక్స్ట్ దేవినేని ఉమను పోలీసులు పట్టుకెళ్లిపోయే సూచనలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది!!

ఇప్పటికే అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో జైలుకెళ్లడం.. మరో నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సుల రిజిస్ట్రేషన్ల కుంభకోణ కేసులో ఇరుక్కోవడం తెలిసిందే. ఈఎస్ఐ స్కాం కేసులో అచ్చెన్నాతోపాటు మరో 12మంది వరకూ అరెస్టయ్యారు కూడా. ఈ క్రమంలో… కృష్ణా పుష్కరాల సమయంలో పుష్కర్ ఘాట్ ల నిర్మాణంలో జరిగిన అవకతవకలను వెలికి తీసేపనిలో భాగంగా… అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ కోసం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది!

2016లో కృష్ణా పుష్కరాలు జరిగిన సందర్భంగా… మొత్తం 34 పుష్కర ఘాట్లను నిర్మించింది నాటి ప్రభుత్వం. వీటిలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, టెండర్లు లేకుండానే పనులు అప్పగించారని అప్పట్లో ఆరోపణలు అత్యంత బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుత ప్రభుత్వం తాజాగా దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో… నెక్స్ట్ దేవినేని ఉమ రెడీనా అంటూ ఆన్ లైన్ లో కామెంట్లు పడుతున్నాయి!!

Read more RELATED
Recommended to you

Latest news