తిరుమలకు వచ్చే భక్తులు జియో ట్యాగ్ కట్టుకోవాలి !

-

ఇవాళ్టి నుంచే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగున్నాయి. ఈ సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులలో వృద్ధులు, చిన్నపిల్లలు విధిగా జియో ట్యాగ్  ను కట్టుకోవాలని ఆదేశాలు జారీచేశారు ఎస్పి పరమేశ్వర్ రెడ్డి. 5 వేల మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశామని.. ఆలయ నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలలోని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల తోపులాట జరుగకుండా సిబ్బందిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గరుడ వాహన సేవలో భక్తుల రీఫిల్లింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామని… తిరుమలలో 15 వేల వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం మాత్రమే ఉన్నందున మిగిలిన వారు తిరుపతిలో మూడు ప్రాంతాలలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసామని తెలిపారు.

భక్తులతో గౌరవప్రదంగా నడుచుకోవాలని సిబ్బందికి సూచించామని… మాడ వీధులు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు వద్ద భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. 2 వేల సీసీ కెమెరాలతో తిరుమల మొత్తం నిఘా ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసందానం చేశామని.. వీలైనంత వరకూ బ్రహ్మోత్సవాల సమయంలో చిన్నారులను తిరుమలకు తీసుకుని రావద్దు, వచ్చినవారు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. నడక మార్గంలో వన్యమృగాల సంచారం నేపథ్యంలో హై అలెర్ట్ జోన్ ప్రాంతంలో అదనపు సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని.. గరుడ సేవ ముందు రోజు మధ్యాహ్నం నుండి తిరుమలకు ద్విచక్ర వాహనాల అనుమతిని నిలిపి వేస్తున్నామన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version