టీడీపీ మేనిఫెస్టో అమలుకు RBI దగ్గరున్న డబ్బు కూడా సరిపోదు – లక్ష్మీపార్వతి

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృతం అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి. టిడిపి మేనిఫెస్టో అంతా మోసపూరితమైన హామీలేనని విమర్శించారు. వైసీపీ పథకాలతో ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా అయిపోతుంది అంటూ ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చిన టిడిపి మేనిఫెస్టో గురించి ఏం చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రకటించిన హామీలన్నీ అమలు చేయాలంటే ఆర్బిఐ వద్ద ఉన్న డబ్బులు కూడా సరిపోవని ఎద్దేవా చేశారు.

ఇక ఆయన కొడుకు నారా లోకేష్ చదువు, సంధ్య లేని మూర్ఖుడిని వ్యాఖ్యానించారు. పాదయాత్రలో సీఎం జగన్ పై నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవినింగ్ వాక్ చేస్తే అది పాదయాత్ర కాదని ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం వారాహి రోడెక్కుతుందని అన్నారు. అంతవరకు హైదరాబాద్ లోనే ఉంటుందని అన్నారు లక్ష్మీపార్వతి.