అమరావతి రోడ్డు వివాదం కేసులో మాజీ మంత్రి నారాయణ కు ఊరుట కలిగింది. నారాయణకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ప్రభుత్వ పిటిషన్ ను సుప్రీం కోర్ట్ తోసి పుచ్చింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించ తలపెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ని మంత్రి హోదాలో నారాయణ ఉద్దేశపూర్వకంగానే మార్చారని, తనవారికి మేలు చేసేందుకే ఆయన పని చేశారంటూ ఏపీ సిఐడి ఓ కేసు నమోదు చేసింది.
అయితే ఈ కేసుపై సిఐడి అధికారులు చర్యలు మొదలెట్టకముందే.. ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. అనారోగ్యం కారణంగా విదేశాలకు వెళ్లాల్సి ఉందని, ఈ క్రమంలోనే అమరావతి కేసులో తనకి ముందస్తుగా బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టును కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన హైకోర్టు ఆయనకి ముందస్తుగా బెయిల్ మంజూరు చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందిి. దీనిపై నేడు విచారణ జరగగా ఏపీ వాతనను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. నారాయణకు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయడానికి అంగీకరించలేదు.