హైకోర్టులో మాజీమంత్రి నారాయణ కు ఊరట

-

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ కు హైకోర్టులో ఊరట లభించింది. పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నారాయణ బెయిల్ రద్దు పిటిషన్ పై చిత్తూరు సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ విచారించి నాలుగు వారాలలో నిర్ణయం తీసుకోవాలని సెషన్స్ కోర్టును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

పదవ తరగతి పరీక్ష పేపర్ లీక్ కేసులో నారాయణకు చిత్తూరు మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన బెయిల్ ను సస్పెన్స్ కోర్టు రద్దు చేసింది. నవంబర్ 30 లోపు నారాయణ ట్రయల్ కోర్టు ముందు లొంగిపోవాలని పేర్కొంది. అయితే దీనిని సవాల్ చేస్తూ నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా నారాయణ తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఏడేళ్లకు పైగా జైలు శిక్ష పడేందుకు పోలీసులు ఈ కేసులో ఐపిసి సెక్షన్ 409 ని చేర్చారని అన్నారు. ఐపీసీలోని సెక్షన్ 409 ప్రభుత్వ ఉద్యోగి నమ్మకాన్ని ఉల్లంఘించిన నేరానికి శిక్షను నిర్వర్తిస్తుందని అన్నారు. వదోపవాదాలు విన్న హైకోర్టు, సెషన్స్ కోర్టు ఉత్తర్వులను రద్దు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news