రాజమార్గాన్నే ఎంచుకోనున్న గంటా… రెండు విషయాలున్నాయంట!!

-

గంటా శ్రీనివాస రావు వైకాపాలోకి వెళ్లడంపై గతకొన్ని రోజులుగా రకరకాల కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆగస్టు రెండోవారంలో గంటా వైకాపాలోకి వెళ్తారని.. లేదంటే ఆగస్టు15న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ వేదికపైకి వెళ్ళి అనధికారికంగా వైకాపాలో చేరినట్లు అటు బాబుకు ఇటు కేడర్ కు సంకేతాలు ఇస్తారని.. అనంతరం మిగిలిన ముగ్గురు (వల్లభనేని వంశీ, మద్దల గిరి, కరణం బలరాం) ల లాగా మారతారని కథనలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే… అలా కాకుండా గంటా శ్రీనివాస్ వైకాపాలో ఛేరిక రాజమార్గంలోనే ఉంటుందని అంటున్నారు!

గంటా శ్రీనివాస్ వైకాపాలో చేరడం అనే విషయంలో విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ లు కాలు అడ్డం పెడుతున్నారని.. గంటా రాక వారికి ఏమాత్రం ఇష్టం లేదని కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో సజ్జల, బొత్స వంటి వారు గంటా రాకను ఆహ్వానిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో తెరవెనుక ఏమి జరిగింది అన్న సంగతి కాసేపు పక్కనపెడితే… సాయిరెడ్డి వద్దాన్నారనో, సజ్జల కావాలన్నారనో కాదు కానీ… జగన్ ఈ విషయంలో కాస్త సానుకూలంగానే స్పందిస్తున్నారని అంటున్నారు!

ఇందులో భాగంగా… ఒకటి రెండు రోజుల్లో గంటా శ్రీనివాస రావు టీడీపీకి రాజినామా చేయబోతున్నారని అంటున్నారు. దొడ్డిదారిలో వెళ్తే ఎప్పుడు ఏమైనా జరగొచ్చని.. అందులో భాగంగా టీడీపీకి రాజినామా చేసిన తర్వాతే వైకాపాలో అధికారికంగా రాజమార్గంలో వెళ్లాలని భావిస్తున్నారంట. అదే జరిగితే ఇక్కడ రెండు విషయాలు ప్రముఖంగా ఉన్నాయి. గంటాను వైకాపాలో చేర్చుకోవడం ద్వారా… సాయిరెడ్డి చేసిన సైకిల్ స్కాం ట్వీట్ పై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తొందగా.. ఇదే క్రమంలో విశాఖలో టీడీపీకి ఇది మాములు దెబ్బ కాదు!! ఇప్పటికే చావుతప్పి కన్ను లొట్టబోయిన బాబుకు ఇది గాట్టి దెబ్బ!!

Read more RELATED
Recommended to you

Latest news