బాబు మార్కు మోసానికి మరోమారు రెడీ అవ్వండి ఆంధ్రులూ!

-

అమరావతిలోనే పూర్తి రాజధాని ఉండకుండా… “అభివృద్ధి వికేంద్రీకరణ”కు మొదటి అడుగుగా భావించిన “పాలనా వికేంద్రీకరణ” బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత కూడా… బాబు తన మార్కు రాజకీయాలను మాత్రం వదలడం లేదు! అమరావతికి భూములిచ్చిన రైతులను మరోమారు మోసం చేయడానికి రెడీ అయిపోతున్నారు. తనకు వ్యక్తిగతంగా నష్టం లేదంటూ… కొత్త పదాలు వాడుతున్నారు! ఈ క్రమంలో క్లారిటీ లేని ఉద్యమానికి బాబు మరోమారు తన ద్వంద్వ ప్రమాణాలతో పునాది వేస్తున్నారు!

అవును… సరిగ్గా ఆలోచిస్తే సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో బాబుకు అన్ని విషయాలూ తెలిసి కూడా ఎలా డ్రామాలు ఆడుతూ, ఏపీ ప్రజలను వంచించారో… సరిగ్గా అదే పద్దతిలో రాజధాని రైతులను వంచించబోతున్నారు. నాడు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కన్ ఫాం అని తెలిసినా కూడా… సమైక్యాంధ్రే కావాలని మొంకి పట్టుపట్టుకుని డ్రామాలాడారే తప్ప… రాష్ట్రం విడిపోతుందని తెలిసినప్పుడు, విభజిత ఏపీకి ఏమి కావాలో అవి అడిగే ఆలోచన చేయలేదు! ఫలితంగా ఏపీకి ఏమి రావాలో అవి రాలేదు.. ఏపీ వాసులు నష్టపోయారు!

ఇదే క్రమంలో… అమరావతిలోనే పూర్తి రాజధాని కాదు, విశాఖకు పరిపాలనా రాజధాని వెళ్తుందని కన్ ఫాం కానప్పుడు, కానంతవరకూ ఎన్ని ఉద్యమాలు చేసినా తప్పు లేదు! కానీ… బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత కూడా, విశాఖకు పరిపాలనా రాజధాని మారుతుందని కన్ ఫాం అయిపోయిన తర్వాత కూడా… ఇంకా ఉద్యమాలు చేస్తామంటూ చెప్పడాన్ని, అది ఆపేది కాదని తెలిసినా మాట్లాడటాన్ని… రైతులను వంచించే కార్యకర్మంగానే చూడాలంటున్నారు విశ్లేషకులు!

విషయం ముగిసింది కాబట్టి… ఇకనైనా అమరావతికి భూములు ఇచ్చిన రైతులు నష్ట పోకుండా, బాబు వారికి కల్పించిన భ్రమలు పూర్తిగా భ్రమలుగా మిగిలిపోకుండా… వారికి ఎలా న్యాయం చేయాలి అనే దిశగా డిమాండులు చేయాలి. దానివల్ల ఫలితం ఉంటుంది. అంతే కానీ… రాజధాని తరలింపుకు ఏపీ ప్రభుత్వం సామానులు సర్దేసుకుంటానికి రెడీ అయిపోయిన తర్వాత కూడా… ఇంకా “అమరావతి.. అమరావతి” అనడం… బాబు మాటలు నమ్మిన రైతులను బాబు మరోమారు వంచించడమే అనేది మరికొందరి మాట!

ఇకనైనా బాబు అలాంటి స్వార్ధ రాజకీయ పనులకు స్వస్థి పలకాలని… రైతులకు వాస్తవాలు చెప్పి, వారికి తాను కల్పించిన ఆశలు పూర్తిగా అడియాశలు కాకుండా చూడటానికి ఏమి చేయాలో ఆలోచించాలని.. తదనుగుణంగా ప్రభుత్వంతో మాట్లాడాలని కోరుకుంటున్నారు! అలా కాకుండా… ఇలా మరోమారు ఉద్యమాలు అంటూ, ఆన్ లైన్ లో ఆవేశపడటం వల్ల ఫలితం ఉండదు సరికదా… రైతులు మరింత లోతుకు కూరుకుపోయే ప్రమాధం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news