అధికారిక లాంఛనాలతో మాజీమంత్రి అంత్యక్రియలు : సీఎం జగన్

కరోనా వైరస్ బారినపడి చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి మాజీ మంత్రి బిజెపి నేత అయిన పైడి కొండల మాణిక్యాలరావు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతిపై ఎంతోమంది రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మాణిక్యాలరావు మృతి పై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాణిక్యాల రావు మృతికి సంతాపం తెలియజేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలి అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కు ఉత్తరువులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా మాణిక్యాల రావు మృతి పై టీడీపీ అధినేత చంద్రబాబు… నారా లోకేష్… కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి… సంతాపం తెలియజేశారు.