ఏపీ పెన్షన్ దారులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 65 లక్షల మంది పెన్షన్ దారులకు నిధులు విడుదల చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ 65 లక్షల పెన్షన్ దారుల కోసం ఏకంగా 1800 కోట్లు విడుదల చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సచివాలయ వారిగా పింఛనుదారుల సంఖ్య ఆధారంగా పంపిణీ చేయాల్సిన మొత్తాలను ఆయా సచివాలయాల పేరుతో బ్యాంకు ఖాతాలోకి జమ చేసింది.
మంగళవారం సాయంత్రానికి దాదాపు అన్ని చోట్ల సచివాలయాల ఉద్యోగులు డబ్బులను డ్రా చేసి గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు అందజేసినట్లు అధికారులు వెల్లడించారు. ఒకటవ తేదీన అంటే ఇవాళ తెల్లవారుజామునుంచే వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి డబ్బులు పంపిణీ చేస్తారని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఓ ప్రకటనలో కూడా తెలిపారు. లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు అందజేసే సందర్భంగా పారదర్శకత కోసం ఆధార నిర్ధారిత బయోమెట్రిక్ మరియు ఐరిష్ విధానాలను అమలు చేస్తున్నామని కూడా వెల్లడించారు.