ఉద్యోగుల కోసం సిపిఎస్ రద్దు చేసి.. తాము తెస్తున్న జిపిఎస్ దేశానికే రోల్ మోడల్ అవుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన సీఎం జగన్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సంతోషం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని అన్నారు. ఉద్యోగుల ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలన్నదే తమ ధ్యేయం అన్నారు.
జిపిఎస్ కోసం రెండేళ్లు కసరత్తు చేసామని.. ద్రవ్యోల్బనాన్ని పరిగణలోకి తీసుకుని ఉద్యోగులకు డిఆర్ లు జిపిఎస్ లో ఇస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో ఎవరు ఏం చెప్పినా వాటిని విశ్వసించనవసరం లేదని సూచించారు. ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ నిర్ణయాలు అన్నీ కూడా 60 రోజులలో అమలులోకి రావాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఎక్కడ జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.