వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో 3 రాజధానుల బిల్లు – మంత్రి గుడివాడ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులకు అందరి మద్దతు ఉందని ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అనుకూలంగా తీర్మానాలు చేశారని.. అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తారని ప్రకటించారు.

విశాఖపట్నంలో మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ఇందులో అనుమానాలకు తావు లేదని ప్రకటించారు. పాదయాత్ర పేటెంట్ రైట్స్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఉన్నాయని చెప్పారు. నారా లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని రాష్ట్రంలో ఏ సమస్య ఉందని ప్రశ్నించారు మంత్రి గుడివాడ.