ఏటీఎం కార్డు వుందా..? అయితే రూ. 2 లక్షల ఉచిత బీమా వుంది.. తెలుసా..?

-

ప్రతీ ఒక్కరికీ ఏటీఎం కార్డు ఉంటుంది. ఏటీఎం కార్డు వలన మనకి ఎన్నో లాభాలు ఉంటాయి. ఈజీగా పేమెంట్ చేసేందుకు ఏటీఎం కార్డు బాగా ఉపయోగ పడుతుంది. ఏటీఎమ్‌ కార్డు లేని వారు ఎవరూ వుండరు కనుక ఇంచుమించుగా అందరు ఈ బెనిఫిట్స్ ని పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే…

డెబిట్‌ కార్డ్‌లు కేవలం డబ్బులు తీసుకోవడానికి, షాపింగ్‌ చేయడానికి ఏ అనుకుంటే పొరపాటే. ఉచిత బీమా పొందే అవకాశం కూడా వుంది. ఇక ఎంత బీమా ఉంటుంది అనే వివరాలని చూద్దాం. డెబిట్‌ కార్డ్‌ ఉన్న కస్టమర్లు ఫ్రీగా ఉచిత బీమా ని పొందొచ్చు.

డెబిట్ కార్డు ఉన్న వారికి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, పర్సనల్ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ బీమా ఇస్తున్నారు కనుక ఈ లాభాలని పొందొచ్చు. ఎస్‌బీఐ గోల్డ్‌ మాస్టర్‌ లేదా వీసా కార్డ్‌ ఉన్నట్టయితే 2 లక్షల భీమా లభిస్తుంది. ప్రమాదం జరిగిన తేదీ నుంచి గత 90 రోజులలో ఒక సారి కార్డును వాడితేనే ఈ బీమా వర్తిస్తుంది చూసుకోండి.

దీనికి ఎవరు అర్హులు..?

ఇక ఎవరు దీనికి అర్హులు అన్నది చూస్తే కనీసం 45 రోజుల పాటు ప్రభుత్వ లేదా ప్రైవేటు బ్యాంకుకు చెందిన ఏటీఎం ని వాడితే బీమా పొందడానికి అర్హులే.
క్లాసిక్ కార్డ్‌పై రూ.లక్ష, ప్లాటినం కార్డుపై రూ.2 లక్షలు వస్తాయ్.
అలానే సాధారణ మాస్టర్ కార్డ్‌పై రూ.50 వేలు ని పొందొచ్చు.
ప్లాటినమ్ మాస్టర్ కార్డ్, వీసా కార్డ్‌లపై రూ.5 లక్షలు వస్తాయ్.
వీసా కార్డుపై 1.5 నుంచి 2 లక్షలు వస్తాయి.
అదే విధంగా ప్రధాన్ మంత్రి జన్-ధన్, రూపే కార్డ్ ఇన్సూరెన్స్‌పై లక్షా లేదా రెండు లక్షలు వస్తాయి.
డెబిట్ కార్డ్ హోల్డర్ ప్రమాదంలో మరణిస్తే బ్యాంకుకి వెళ్లి దీన్ని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news