సెటప్ చంద్రబాబు, గెట్ ఔట్ చంద్రబాబు అనే స్లోగన్ తీసుకోండి – గుడివాడ అమర్నాథ్

-

సెటప్ చంద్రబాబు, గెట్ ఔట్ చంద్రబాబు అనే స్లోగన్ తీసుకోవాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. 3 సంవత్సరాల తరువాత చంద్రబాబు వైజాగ్ వచ్చారని.. చంద్రబాబు అమరావతి ప్రజలకు చెప్పోచ్చు కదా అమరావతి అభివృద్ధి చేస్తాం విశాఖ రాజధాని చేస్తాము అని చెప్పారు. చంద్రబాబు రాజకీయాలు చేస్తూ నారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చెస్తున్నారని… చంద్రబాబు అధికారంలో ఉన్న 14 సంవత్సరాల కాలంలో రాష్ట్రం కరువుతో ఉందని చురకలు అంటించారు.

చంద్రబాబు ఆయన కొడుకు కి మించిన ఐరన్ లెగ్ లేదని.. ప్రతిపక్షాలు కలవాలి అని అంటారు..సొంతగా పోటీ చేసే దమ్ములేదని ఎద్దేవా చేశారు. సొంత కొడుకు కంటే దత్త పుత్రుడు నే చంద్రబాబు నమ్ముకున్నాడు… పప్పు బెల్లాలు లాగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారని విమర్శిస్తున్నాయని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఆ పథకాల్లో అవినీతి ఎక్కడైనా జరిగిందా… చంద్రబాబు హయాంలో ధరలు పెరగలేదా అని నిలదీశారు. ప్రజా ఉద్యమం వచ్చింది కాబట్టే చంద్రబాబు ప్రతిపక్షం లో ఉన్నారని ఆగ్రహించారు. సెటప్ చెంద్రబాబు గెట్ ఔట్ చంద్రబాబు అనే స్లోగన్ తీసుకోండి..2024లో ఎక్కువ సీట్లు వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మరిన్ని సీట్లు గెలుచుకుంటామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news