ఏపీకి రూ.40 వేల కోట్ల కేంద్రం నిధులు విడుదల !

-

ఏపీకి రూ.40 వేల కోట్ల నిధులను గ్రాంట్ల రూపంలో కేంద్రం విడుదల చేసిందని ఎంపీ జీవియల్ నరసింహారావు ప్రకటన చేశారు. ప్రాంతీయ పార్టీలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని… కేంద్రంపై నిందలు‌ వేసి తప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. అబద్దాలు ప్రచారం చేసే పార్టీలు చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్‌ విసిరారు.

2015-16 లో 27,990కోట్లు, 2020-21 లో మూడు రెట్లు 77,538 కోట్లు కేంద్రం ఇచ్చిందని.. మరో 40వేల కోట్లు గ్రాంట్ల రూపంలో ఎపికి ఇచ్చారని స్పస్టం చేశారు. ఆరేళ్లలో ఇన్ని నిధులు ఏ రాష్ట్రానికి ఇవ్వలేదని.. మోదీకి ఎపి పై అభిమానం ఉంది కాబట్టే ఇన్ని నిధులు వచ్చాయని పేర్కొన్నారు.

లోటు బడ్జెట్ వల్ల ఎపి నుంచి కేంద్రానికి వెళ్లే పన్నులు తక్కువేనని.. మనకు కేంద్రం నుంచి ఎన్నో నిధులు అదనంగా వచ్చాయని స్పష్టం చేశారు. ఈ అంశాలపై ప్రాంతీయ పార్టీలు ఎందుకు మాట్లాడరని.. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా15వేల కోట్ల రుణాన్ని కేంద్రం చెల్లించేలా అంగీకరించిందని పేర్కొన్నారు. ఇన్ని జరుగుతున్నా … బిజెపి ఏమీ చేయలేదని అసత్యాలు ప్రచారం చేస్తారా ? అని నిలదీశారు. వీటిపై బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news