తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రాష్ట్రాలపై వరుణుడు తన ప్రకోపాన్ని చూపిస్తున్నాడు. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా కురుస్తుండటంతో సామాన్యలు అల్లాడుతున్నారు. ఎక్కడికక్కడ వాగులు, చెరువులు, ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో వర్షాప్రభావం మరింత తీవ్రంగా ఉన్నది.
విజయవాడలో భారీ వర్షం కారణంగా నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఇకపోతే భారీ వరదల కారణంగా హనుమాన్ జంక్షన్ వద్ద తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. బాపులపాడు గ్రామసమీపంలోని హనుమాన్ జంక్షన్ -విజయవాడ ప్రధాన రహదారిపై కిలో మేటర్ల వాహనాలు నిలిచిపోయాయి. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుడమేరు వాగు పొంగి వరదలు రావడంతో ప్రమాదాలు సంభవించకుండా అధికారులు వాహనాలను నిలువరిస్తున్నారు.