తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా చెన్నైలో ఉదయంలో తెల్లవారుజామున నుండి భారీ వర్షం పడుతోంది. దీంతో టినగర్,వేలాచ్చేరి,అన్నా నగర్, సహా మెరినా పరిసరాలు నీట మునిగాయి. చెన్నై,తిరువళ్ళూరు, కాంచిపురం,చెంగల్ పట్టు జిల్లాలోని స్కూల్ కాలేజీలకు సెలవులు కూడా ప్రకటించారు.
కంచి, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు రాణిపేట్, వేలూరు, తిరుపత్తూరు, ధర్మపురి, కృష్ణగిరి, కరూర్, తిరువణ్ణామలై, తిరుచ్చి, విరుదునగర్, శివగంగై, రామనాథపురం, పుదుకోట్టై, తంజావూరు, తిరువారూరు, నాగై, మైలాడుతురై, కడలూరు, కల్లకూరిచి, విల్లుపురం, కల్లకురిచి, విల్లుపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
అయితే.. భారీ వర్ష సూచనతో ఫ్లైఓవర్ లు ఎక్కాయి వేలాది కార్లు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో చెన్నై, వేలచేరి పరిసరాల్లో ఫ్లైఓవర్లపై కార్లను పార్క్ చేశారు స్దానికులు. గతంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల కార్లు ఎందుకు పనిరాకుండా పోయాయని అంటున్నారు స్దానికులు.