చిత్తూరు పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పుంగనూరులో చంద్రబాబు పర్యటన నేపధ్యంలో అడ్డుకోవడానికి వైసిపి పార్టీ సన్నద్ధం అయింది. పుంగనూరులో రెండు నీటి ప్రాజక్టులపై కోర్టు స్టే తెచ్చి నిలిపివేశారని… అభివృద్ధి చేస్తే ఏమాత్రం సహించలేక ఇలాంటి పనులు చేశారంటూ వైసిపి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లే కార్డులు ప్రదర్శన చేపట్టింది వైసీపీ పార్టీ.
పుంగనూరులో ప్రాజెక్టులు నిలిచిపోవడామికి కారణమైన చంద్రబాబును ఎట్టి పరిస్థితులలో పుంగనూరులో అడుగుపెట్టినివ్వమంటూ వైసిపి స్పస్టం చేస్తోంది. అటు పుంగనూరులో రోడ్ షో చేసి తీరుతామని టిడిపి చెబుతోంది. పెద్దిరెడ్డి అరాచకాలకు, అవినీతి ప్రతీక అ ప్రాజెక్టులు అందుకే అడ్డుకుని రైతులకు న్యాయం చేశామంటోంది టిడిపి. ఇలాంటి తరుణంలోనే.. ఐదు వందల మంది పోలీసులతో భారీ భధ్రత ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించమని..పోలీసులకు రెండు పార్టీ నాయకులు, కేడర్ సహకరించాలని కోరారు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి.