సుగాలి ప్రీతి కేసు సీఐడీ చేతికి..!

-

హోం మంత్రి అనితను కలిశారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి దేవి. తన బిడ్డ మృతిపై విచారణ జరిపించాలని కోరారు ఆమె. మాజీ సీఎస్ జవహర్ రెడ్డిపై సుగాలి ప్రీతి తల్లి సంచలన ఆరోపణలు చేసారు. అయితే సుగాలి ప్రీతి కేసు సీఐడీకి అప్పగిస్తామని హోం మంత్రి హామీ ఇచ్చారు. అయితే ఈ విషయంపై సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి మాట్లాడుతూ… సుగాలి ప్రీతి కేసును సీబీఐకి ఇస్తున్నట్లు గత ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. ఎంతకు సీబీఐ విచారణ చేయకపోవడంతో.. ఢిల్లీ వెళ్లి సీబీఐ కార్యాలయంలో జీవోలు చూపించాం. సీబీఐ అధికారులు ఆ జీవోలను టిష్యూ పేపరుతో సమానమన్నారు. ప్రాపర్ ఫార్మేట్ లో వచ్చుంటే ఇప్పటికే ఈ కేసు విచారణ ప్రారంభించే వారమని సీబీఐ అధికారులు చెప్పారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగనే ఇలా ఫేక్ జీవోలు ఇచ్చి మమ్మల్ని మోసం చేశారు.

కుమార్తె పోయిన బాధలో ఉన్న తమను గత ప్రభుత్వం మరింతగా బాధించింది. కేసు విచారణ సీఐడీకి అప్పగిస్తామని హోం మంత్రి చెప్పారు. సీఐడీ చీప్ రవిశంకర్ అయ్యాన్నార్ స్వయంగా ఈ కేసును విచారించాలని కోరాం. సుగాలి ప్రీతి కేసు విషయంలో డిప్యూటీ సీఎం చాలా సీరియస్ గా ఉన్నారని హోం మంత్రి కూడా చెప్పారు. ఈ ప్రభుత్వంలో అయినా మాకు న్యాయం జరుగుతుందని.. తమ కుమార్తె ఆత్మకు శాంతి లభిస్తుందని భావిస్తున్నాం. ఈ కేసులో మాజీ సీఎస్ జవహర్ రెడ్డి కూడా మాకు అన్యాయం చేశారు. మా కుమార్తె చదివిన విద్యాసంస్థల యజమానులకు మాజీ సీఎస్ అండగా నిలిచారు.. కేసు నీరు గార్చారు. ఏడేళ్ల తమ ఆవేదనకు ఇకనైనా ఈ ప్రభుత్వం న్యాయం చేయాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందు నుంచి మాకు అండగా నిలబడ్డారు. నా బిడ్డకు న్యాయం చేయాలంటూ ర్యాలీ నిర్వహించి పవన్ ధైర్యాన్ని ఇచ్చారు. పవన్ను కలిశాక హోం మంత్రిని కలవాలని సూచించడంతో హోం మంత్రి అనితను కలిసాం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news