ఈసీ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది..!

-

మేము అడిగిన అంశాలను ఇవ్వకుండా ఏదేదో చెబుతూ నిన్నటి నుంచి మమ్మల్ని ఈసీ ఇబ్బంది పెడుతుంది అని అన్నారు మాజీ ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్. నిన్న మాక్ పోల్ లో 1400 ఓట్లు వేస్తే బ్యాటరీ ఛార్జింగ్ ఎనభై శాతం కనిపించింది. తరువాత చూసుకుంటే తొంబైశాతం చూపిస్తుంది. ఇలా 25 రోజులుంటే బ్యాటరీ ఛార్జింగ్ తగ్గాలి.. కానీ ఇక్కడ పెరుగు తుంది అని అన్నారు. అలాగే బెల్ కంపెనీ వాళ్లు సాంకేతిక అంశం పై మేము చెప్పలేమని చేతులేత్తేశారు.

కోర్టు కి వెళ్లి ఆర్డర్ తీసుకొస్తేనే ఏదైనా చెయ్యగలమని సమాధానం ఇస్తున్నారు. కాబట్టి ఇది ఈసీ నిర్లక్ష్యమనే మేము భావిస్తున్నాం. ఈవీఎంలు హ్యాకింగ్ జరిగాయేమోనని మాకైతే అనిపిస్తోంది. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగలేదని అనుమానం మాకుంది. దానికి తగిన విధంగానే ఈవీఎంల విషయంలో అధికారుల నుంచి సరైనా సమాధానం మాకు రాలేదు. కాబట్టి దీనిపై సుప్రీంకోర్టు కు వెళ్లాలని భావిస్తున్నాం అని బెల్లాన చంద్ర శేఖర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news