చంద్రబాబుకి షాక్ ఇచ్చిన హోం మంత్రి…!

-

టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనపై ఇప్పుడు అనేక అనుమానాలు ఉన్నాయి. ఆయన విశాఖ వెళ్తారా లేదా అనేది స్పష్టత రావడం లేదు. ఆయన డీజీపీ ని అనుమతి కోరుతూ లేఖ పెట్టుకున్నా సరే ఇప్పటి వరకు ఏపీ సర్కార్ నుంచి ఏ ప్రకటన కూడా రాలేదు. అయితే తెలంగాణా సర్కార్ మాత్రం ఆయన వెళ్ళడానికి అనుమతులు ఇచ్చింది కూడా.

ఈ తరుణంలో ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. వైజాగ్ వెళ్ళడానికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు లేని అభ్యంతరాలు చంద్రబాబుకి ఎందుకు అని ఆమె నిలదీశారు. చంద్రబాబు అడిగితే అనుమతి ఇస్తామన్న ఆమె ఇప్పటి వరకు ఆయన అనుమతి అడగలేదని అన్నారు. ఇక సిఎం జగన్ పాలనపై మాట్లాడిన ఆమె… వాలంటీర్, సచివాల ఉద్యోగులతో ఉద్యోగ విప్లవం తీసుకొచ్చారని కొనియాడారు.

అదే విధంగా అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించామని ఆమె వివరించారు. రైతు భరోసా పెంచి ఇస్తున్న ఘనత జగన్ సర్కారుకే దక్కుతుందని ఆమె వివరించారు. కరోనా సమయంలో మహిళలకు సున్నా వడ్డీ విడుదల చేశామని పేర్కొన్నారు. గత ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించామన్న ఆమె… పోలీస్ శాఖలో వీక్లీ హాఫ్‌ను ప్రకటించి అమలు చేస్తున్నామన్నారు. దిశ చట్టాన్ని తీసుకొచ్చామని వివరించారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చిన ఆమె… జీరో ఎఫ్ఫైఆర్ ని అమలు చేస్తున్నట్టు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news