కరోనా నుంచి కోలుకున్న వారి ప్రేమ చూస్తే…

-

కరోనా వైరస్ తీవ్రతలో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతుంది వ్రుద్దులే. ప్రపంచ వ్యాప్తంగా కూడా వ్రుద్దులే ఎక్కువగా కరోనాకి బలైపోతున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా వారి కోసం ఎన్ని విధాలుగా వైద్య సదుపాయాలు అందించినా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు. అయితే కొన్ని దేశాల్లో మాత్రం వారి ప్రాణాలను కాపాడటానికి వైద్యులు చాలా వరకు సమర్ధవంతంగా వ్యవహరిస్తున్నారు.

అమెరికా, భారత్, యుకె వంటి దేశాల్లో వృద్దుల ప్రాణాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అమెరికాలో ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఒక వృద్ద జంట కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఒకరికి 91 ఏళ్ళు కాగా ఒకరికి 89 ఏళ్ళు. దాదాపు రెండు నెలల పాటు ఇద్దరూ కూడా కరోనాతో పోరాటం చేసి ఆ తర్వాత పూర్తిగా బయటపడ్డారు.

70 ఏళ్ళ వైవాహిక జీవితంలో వారి ఇద్దరు ఒకరు లేకపోతే ఒకరు ఉండరు అనే విధంగా బ్రతికారు. అయితే కరోనాతో పోరాడే సమయంలో మాత్రం దూరంగా ఉన్నారు. వారిపేర్లు జీన్ మరియు వాల్టర్ విల్లార్డ్. న్యూయార్క్ లోని ట్రాయ్లోని నర్సింగ్ హోమ్లో వారు ఇద్దరు కరోనాతో కోలుకుని తిరిగి కలుసుకున్నారు. ఒకరికి ఒకరు ముద్దులు కూడా పెట్టుకున్నారు. ఈ వీడియో ని సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా అనుష్క శర్మ దానికి లైక్ కొట్టారు. షేర్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news