ఏపీలో వరుసగా జరుగుతున్న లైంగిక దాడులపై హోం శాఖ మంత్రి తానేటి వనిత తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమరం రేపుతున్నాయి. ఆడవాళ్లపై అఘాయిత్యాలు, అత్యాచారాలు వంటివి జరగకుండా తల్లులే జాగ్రత్త తీసుకోవాలని ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
మొదట బిడ్డల బాధ్యత తల్లులు దే, తరువాతే పోలీస్ లది అంటూ వ్యాఖ్యలు చేశారు హోం శాఖ మంత్రి తానేటి వనిత. తల్లి పిల్లలు పెరిగే వాతావరణం కూడా చూసుకోవాలని.. ఆడ బిడ్డల సంరక్షణ తండ్రి మీద కంటే తల్లి మీదే ఎక్కువగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పనులకు వెళ్ళినపుడు బిడ్డలను 24 గంటలు కాపాడుకోలేమని కొంతమంది తల్లులు అంటున్నారని.. తల్లి పాత్ర సక్రమంగా పోషించకుండా పోలీసుల మీద, ప్రభుత్వం మీద వేయడం సరైన పద్ధతి కాదని చురకలు అంటించారు. అయితే… హోం శాఖ మంత్రి తానేటి వనిత చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.