సినీ కార్మికులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త..త్వరలోనే వారికి ఇండ్లు

-

సినీ కార్మికులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. ఇళ్లు లేని సినీ కార్మికులకు రాబోయే కాలంలో చిత్రపురిలో ఇళ్లు ఇస్తామని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వం సినీ కార్మికుల వెంటే ఉంటుందని.. చిరంజీవి గారు పెద్ద ఆస్పత్రి కట్టాలనే సంకల్పంతో ఉన్నారన్నారు. చిత్రపురిలోని పాఠశాలు, ఆస్పత్రికి కావల్సిన స్థలం ఉందని.. చిరంజీవి గారు చిత్రపురి స్థలంలో ఆస్పత్రి నిర్మిస్తే కొన్ని వేల మంది కార్మికులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.


మే డే వచ్చిదంటే యావత్ ప్రపంచమంతా కార్మిక దినోత్సవం జరుపుకుంటుందని… 24 విభాగాలకు సంబంధించిన లక్షలాది మంది కార్మికులు రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి సినీ కార్మికులదని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ ప్రభుత్వం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తోందని… తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా మెగాస్టార్ చిరంజీవి ఉన్నారన్నారు. ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా సినీ పరిశ్రమ పచ్చగా ఉండాలన్నది చిరంజీవి ఆకాంక్ష అని… చిరంజీవి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కులం, మతం లేదని.. యూసఫ్ గూడ, కృష్ణానగర్, కార్మికనగర్, చిత్రపురిలో వేలాది మంది సినీ కార్మికులు జీవిస్తున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news