చంద్రబాబు పై విమర్శలు చేయడానికి మనస్సు ఎలా వచ్చింది.. జగన్ పై లోకేష్ ఫైర్..!

-

వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేష్ తాజాగా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్న మీకు ఆ హుందాతనం ఉందా..? జగన్ బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారి అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. పాస్ పోర్ట్ సమస్య లేకపోతే ఎప్పుడో లండన్ ఎగిరిపోవాల్సిన మీరు బెంగళూరు ప్యాలెస్ లో రిలాక్స్ అవుతున్నారు. 74 సంవత్సరాల వయస్సులో కూడా సీఎం చంద్రబాబు క్షణం తీరిక లేకుండా వరద బాధితులకు సాయం అందిస్తున్నారు. ఆయన పై విమర్శలు చేయడానికి మీకు మనస్సు ఎలా వచ్చిందని ఫైర్ అయ్యారు లోకేష్.

విపత్తులు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ అందజేసిన చరిత్ర మీకు లేదు.. పైగా మీరు ప్రకటించే సెల్ఫ్ చెక్స్ కథ అందరికీ తెలిసినదే. గతంలో చంద్రబాబు బుడమేరు ఆధునీకరణకు రూ.464 కోట్లు కేటాయించి పనులను ప్రారంభిస్తే.. మీ రివర్స్ పాలనలో విపత్తుకు ప్రధాన కారణమయ్యారని మండిపడ్డారు. బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం జగన్ అని.. జగన్ మేడ్ డిజాస్టర్.. ఆధునీకరణ మరమ్మతు పనులు నిలిపివేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news