ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ యాదవ్ కాన్వాయ్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై 1200 రోజులు అవుతున్న సందర్భంగా వారికి సంఘీభావం తెలిపినందుకు సత్యకుమార్ వెళుతుండగా ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో సత్యకుమార్ కాన్వాయ్ కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి.
అయితే ఈ దాడి వెనుక వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ ఉన్నారని.. ఆయనను విచారణ చేయాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు. భౌతిక దాడులకు సిద్ధమని వైసిపి చెబితే మేము కూడా సిద్ధమే అంటూ సవాల్ విసిరారు సత్యకుమార్. అయితే సత్య కుమార్ ఆరోపణల పై స్పందించారు ఎంపీ నందిగాం సురేష్.
సత్య కుమార్ దాడి ఘటనలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. దాడి జరిగిన సమయంలో తాను లంక పొలాల్లో ఉన్నానని, గొడవ చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. అమరావతి రైతులపై బిజెపి, టిడిపి వాళ్ళే దాడి చేసి.. తాము చేశామని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి డైరెక్షన్ లోనో దాడి చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు ఎంపీ సురేష్.