ప‌వ‌న్ కు విశాఖ ఉక్కుపై ప్రేమ ఉంటే బీజేపీ ముందు ధ‌ర్నా చేయాలి : అంబ‌టి

జ‌న సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం పై ప్రేమ ఉంటే.. విశాఖ ఉక్కు పై చిత్త శిద్ధీ ఉంటే.. ఢిల్లీ లో ని బీజేపీ కార్యాల‌యం ముందు.. ధ‌ర్నా చేయాల‌ని అంబ‌టి రాంబాబు స‌వాల్ విసిరారు. త‌మ పాట్న‌ర్ గా ఉన్న బీజేపీ పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏమీ అన‌కుండా.. త‌మను బీజేపీ పై ఆందోళ‌న చేయాల‌ని అనడం వింత గా ఉంద‌ని అన్నారు.

మోడీ వార‌సత్వం రాజ‌కీయాన్ని తొల‌గించాడ‌ని.. అందుకే మోడీ ఇష్టం అని ప‌వ‌న్ అన్నాడ‌ని.. అయితే చంద్ర బాబు నాయుడు చేస్తుంది వార‌స‌త్వ రాజ‌కీయం కాదా అని ప్రశ్నించాడు. అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్ అప్పులు ఉన్నాయ‌ని.. రాష్ట్రం కూడా అమ్మేస్తారా అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నాడ‌ని అన్నారు. అయితే కేంద్రం లో ఉన్న బీజేపీ అప్పులు ల‌క్ష‌ల కోట్లు ఉన్నాయ‌ని.. అన్నారు. అయితే కేంద్రాన్ని ఏ దేశానికి అమ్ముతార‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే ద‌మ్ము ఎందుకు లేద‌ని ప్ర‌శ్నించారు.