గల్లా దూరంగా ఎందుకు…?

ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీకి పూర్తిస్థాయిలో సహకరించడం లేదనే ఆవేదన కార్యకర్తల్లో వ్యక్తమౌతుంది. చాలామంది ఆయన విషయంలో ఇబ్బంది పడుతున్నారని టీడీపీ నేతలు కూడా అంటున్నారు. గల్లా జయదేవ్ కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన పార్లమెంట్ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదని కొంతమంది అంటున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో అలాగే పంచాయతీ ఎన్నికల్లో ఆయన నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా కష్టపడలేదు అనే భావన కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఉన్న విభేదాలతో ఇప్పుడు సమస్యలు గల్లా జయదేవ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇక నారా లోకేష్ తో విభేదాల కారణంగా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు అనే భావన కూడా చాలామందిలో వ్యక్తమవుతోంది. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో గల్లా జయదేవ్ ని కొన్ని కొన్ని విషయాల్లో నారా లోకేష్ ఇబ్బంది పెట్టడం ఇప్పుడు గల్లా జయదేవ్ కు నచ్చడం లేదని సమాచారం.

పార్టీ సీనియర్ నేతల ఆవేదన వ్యక్తం చేశారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అయితే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పెద్దగా ప్రచారం చేయకపోవడానికి కారణం ఏంటనేది అర్థం కావడం లేదు. ఈ విషయంలో భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఎటు మలుపు తిరుగుతాయి అనేది చూడాలి.