తిరుమల: శేషాచల కోండలలో చిరుతల సంచారం పెరుగుతోంది. శేషాచల కోండలలో మొత్తం 45 వరకు చిరుతలు సంచరిస్తూన్నట్లు సమాచారం. దీంతో నడకమార్గంలో భక్తులుకు ఇబ్బంది కలగకూండా జాగ్తత్తలు తీసుకోవడం పై దృష్టి పెట్టింది టిటిడి. చిరుత కదలికలపై నిఘా పెట్టేందుకు 500 ట్రాప్ కెమరాలు ఏర్పాటుు చేశారు. నడకమార్గంలో రెండు వైపుల రెండు మీటర్ల వరకు చెట్లు లేకూండా ఏర్పాట్లు చేస్తున్నారు.
నడకమార్గంలో బ్రాడ్ కాస్టింగ్ ద్వారా నిరంతరంగా ప్రసారాలు చేసేలా ఏర్పాట్లు చేపడుతున్నారు. నడకమార్గంలో గాలిగోపురం నుంచి లక్ష్మినరశింహ ఆలయం వరకు గుంపులుగా భక్తులును అనుమతించేలా చర్యలు చేపడుతున్నారు. నడకమార్గంలో అటవి ప్రాంతం వైపు ఫోకస్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు టీటీడీ అధికారులు.