పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ పై ఎంతో నమ్మకం ఉంది – మంత్రి పెద్దిరెడ్డి

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో రూ. 165 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఫెర్రో అలాయి పరిశ్రమకు శుక్రవారం భూమి పూజ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ పరిశ్రమ ద్వారా 250 మందికి ప్రత్యేకంగా, 800 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ఆ పరిశ్రమ ఏర్పాటుకు ఎలక్ట్రో స్టీల్ క్యాస్టింగ్ లిమిటెడ్ ముందుకు వచ్చింది.

అరడిగుంట వద్ద 56 ఎకరాల స్థలంలో ఏర్పాటు కానున్న ఆ పరిశ్రమకు భూమి పూజ చేసిన అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ పై ఎంతో నమ్మకం ఉందన్నారు. గతంలో అనేక ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లు పెట్టినా రాని వ్యాపారవేత్తలు ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని తెలిపారు.