అది జ‌రిగితే చంద్ర‌బాబు హీరో అయిన‌ట్టే..!

-

రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై మేం కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం. హోం శాఖ స‌హాయ మంత్రి కిష ‌న్ రెడ్డికి చెబుతాం.. అంటూ.. గ‌డిచిన రెండు మూడు రోజులుగా టీడీపీ నాయ‌కులు య‌న‌మ‌ల రామ ‌కృష్ణు డు స‌హా చంద్ర‌బాబు కూడా హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. రెండు రోజుల కింద‌ట చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ ‌ల‌కు రాసిన లేఖ‌లో కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం క‌రోనా తీరుపై చేస్తున్న నిర్ల‌క్ష్యాన్ని మా ఎంపీలు పార్ల‌మెంటు ద్వారా కేంద్ర ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్తార‌ని అన్నారు. మొత్తానికి టీడీపీ అధినేత స‌హా ఆ పార్టీ నేత‌ల వ్యూహం ఏంటంటే.. ఇప్ప‌టికిప్పుడు కేంద్రం వ‌చ్చి రాష్ట్రం రాజ‌కీయాల్లో జోక్యం చేసుకోవాలి.

రాష్ట్ర ప్ర‌భుత్వానికి మొట్టికాయ‌లు వేయాలి. ఇదీ వారు కోరుకుంటున్న త‌క్ష‌ణ అవ‌స‌రం! మ‌రి కేంద్రానికి అంత తీరిక ఉందా? అస‌లు కేంద్రానికి ఆ ఉద్దేశం ఉందా? అనేది కీల‌క ప్ర‌శ్న‌. రాష్ట్రంలో వైసీపీ నేత‌లు చేస్తున్న సాయం జాత‌ర విష‌యంలో కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని, కేంద్రం నుంచి బృందాలు రానున్నాయ‌ని, ఇక్క‌డి ప‌రిస్థితిని అంచ‌నా వేసి,కేంద్ర బ‌ల‌గాల‌ను ఏపీలో మోహ‌రించ‌నున్నాయ‌ని చంద్ర‌బాబు అనుంగు మీడియా కూడా ప్ర‌చారం చేసింది.

దీంతో అసలు నిజంగానే కేంద్రం వ‌చ్చి ఏపీ ప‌రిస్థితిపై సీరియ‌స్ అవుతుందా ? అయితే, చంద్ర‌బాబు హీరో అవుతారా? అనే ప్ర‌శ్న‌లు ఉద‌యించాయి.
నిజానికి దేశంలో ఉన్న ప‌రిస్థితిని చూస్తే.. బీజేపీ అనుకూల రాష్ట్రాలు, పాలిత రాష్ట్రాల్లో క‌రోనా విజృంభి స్తోంది. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో క‌రోనా కోర‌లు చాస్తోంది. ఈ స‌మ‌యంలో కేంద్రం నిజానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భావిస్తే.. ముందు ఆ రాష్ట్రాల్లో చ‌ర్య‌లు తీసుకోవాలి. అక్క‌డి పాల‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి. అంతే త‌ప్ప‌.. ఆది నుంచి కూడా క‌రోనాపై పోరు చేస్తున్న ఏపీపై ఎలా ముందుగా స్పంది స్తార‌ని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇది కూడా నిజ‌మే క‌దా? అంటున్నారు ప‌రిశీల‌కులు. తాము అధికారంలో ఉన్న‌ప్పుడు కేంద్రం రాష్ట్ర విష‌యాల్లో ఏలా జోక్యం చేసుకుంటుంద‌ని ప్ర‌శ్నించిన బాబు అండ్ కో .. ఇప్పుడు యూట‌ర్న్ తీసుకోవ‌డం, ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఏమేర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నిస్తున్నారు విశ్లేష‌కులు. నిజ‌మే క‌దా!!

Read more RELATED
Recommended to you

Latest news