రాజకీయాల్లో ఎంతగా పలుకుబడి ఉన్నప్పటికీ.. ప్రజల్లో ఆదరణ లేకపోతే..ఎవరి పరిస్థితి అయినా జీరోనే! ఇప్పుడు ఇలాంటి పరిణామాలనే ఎదుర్కొంటున్నారు టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్. రాజకీ యంగా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరిక. అయితే, ఆయన ప్రజల్లో ఆమేరకు గుర్తింపు సాధించ లేక పోతున్నారు. వాస్తవానికి టీడీపీలో సీనియర్‌నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు స్వయానా వియ్యంకుడు అయిన పుట్టా పట్టుబట్టి టికెట్ సంపాయించుకుంటున్నారు కానీ.. గెలుపు గుర్రం ఎక్కలేక పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
నిజానికి మైదుకూరులో టీడీపీకి బలం లేదా? కేడర్ లేదా? అంటే.. పుష్కలంగానే ఉన్నాయి. అయితే, వా టిని తనవైపు మలుపు తిప్పుకోవడంలోనే పుట్టా విఫలమవుతున్నారనే వాదన ఉంది. గతంలో ఇక్కడ టీడీ పీ తరఫున పోటీ చేసి ఓడిన.. శెట్టిపల్లి రఘురామిరెడ్డి పార్టీని బలోపేతం చేశారనడంలో సందేహం లేదు. ఆయన ఓడిపోయినా.. స్వల్ప తేడాతోనే ఓడారు తప్ప భారీ మెజారిటీ తేడా ఎప్పుడూ రాలేదు. అనంత రం, మారిన సమీకరణల నేపథ్యంలో ఈయన వైసీపీ గూటికి చేరిపోయారు. దీంతో టీడీపీలో పోస్టు ఖాళీ కా వడంతో పుట్టా దానిలోకి వచ్చారు.
వాస్తవానికి రెడ్డి వర్గానికి ప్రాబల్యం ఎక్కువగా మైదుకూరులో బీసీ వర్గానికి చెందిన పుట్టాను ఇంచార్జ్‌గా ని యమించడంతోనే టీడీపీ సగం బలం కోల్పోయిందనే వాదన ఉంది. 2014 ఎన్నికల్లో పుట్టా ఓటమి తర్వా త పట్టుబట్టి టీటీడీ చైర్మన్‌గా నియామకం పొందారు. ఈ క్రమంలోనే గత ఏడాది ఎన్నికల్లో వేరే వారికి టికె ట్ ఇవ్వాలని చంద్రబాబు భావించారు. కానీ, యనమల రంగంలోకి దిగి మళ్లీ పుట్టాకే అవకాశం ఇచ్చారు. మొత్తానికి పట్టుబట్టి టికెట్ సంపాయించుకున్నా పుట్టా మాత్రం ఓడిపోయారు. ఇక, ఇప్పుడు పరిస్తితి ఏంటి? అంటే కనుచూపు మేరలో టీడీపీ పుంజుకునే అవకాశం కూడా కనిపించడం లేదు.
టీడీపీ కేడర్ అంతా కూడా ఇప్పుడు వైసీపీ పంచన చేరిపోయింది. ఈ పరిణామాలను చూస్తూ.. కూడా సరిదిద్దలేని పుట్టా వ్యవహారం ఫ్యూచర్లోనూ పుంజుకునేలా కనిపించడం లేదు. దీంతో ఇక ఆయన పొలిటికల్‌గా రిటైర్మెంట్ తీసుకున్నట్టేనని అంటున్నారు. మొత్తానికి తన కల సాకారం కాకుండానే రాజకీయాల నుంచి విరమించుకున్న నాయకుడిగా పుట్టా మిగిలిపోయారని తమ్ముళ్లు అంటుండడం విశేషం.