వైసీపీలో స‌రికొత్త హాట్ టాపిక్‌…. అదే జ‌రిగి ఉంటే..?

-

కొన్ని విష‌యాల్లో ఇలా కాకుండా అలా జ‌రిగి ఉంటే.. అంటూ.. చాలా మంది భావిస్తుంటారు. కానీ, జ‌రిగిపోయి న కాలం తిరిగిరాదు. జ‌ర‌గాల్సింది జ‌ర‌గ‌క మాన‌దు. అయినా కూడా ఆ చింత మాత్రం అలా ఉండిపోతుంది. ఇప్పుడు ఇదే త‌ర‌హా చింత వైసీపీలోనూ క‌నిపిస్తోంది.  అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగి ఉంటే.. అంటూ నాయకు లు త‌మ‌లో తాము మ‌ధ‌న ప‌డుతున్నారు. నిజ‌మే.. క‌రోనా వైర‌స్ కార‌ణంగా.. దేశ‌మేంటి.. ప్ర‌పంచ‌మే లాక్‌డౌ న్‌తో అల్లాడిపోతోంది. జ‌ర‌గాల్సిన కార్య‌క్ర‌మాలు అన్నీ కూడా వాయిదా ప‌డుతున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ ‌లు కూడా ప‌నులు మానుకుని ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు.

ఈ ప‌రిస్థితి ఇంకెన్నాళ్లు ఉంటుందో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నూ కార్య‌కలాపాలు నిలిచిపోయాయి. అయితే, మిగిలిన రాష్ట్రాల‌కు ఏపీకి ప్ర‌త్యేక‌త ఉంది. ఏపీలో ప్ర‌భుత్వం కొత్త‌గా ఏర్ప‌డింది. ఇక్క‌డి ప్ర‌జ‌లు ఎన్నో ఆశ‌ల‌తో వైసీపీకి ప‌ట్టంగ‌ట్టారు. దీంతో ప్ర‌భుత్వం కూడా తాము ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసేందుకు మేనిఫెస్టోను పూర్తిగా అమ‌లు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే మ‌ద్య నిషేధాన్ని అమ‌లు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంది. అదేస‌మ‌యంలో మ‌రికొన్ని అమ్మ ఒడి వంటి కీల‌క ప‌థ‌కాన్ని కూడా అమ‌ల్లో పెట్టింది.

ఎన్ని చేసినా కూడా గ‌డిచిన నెల రోజుల స‌మయంలో రెండు కీల‌క విష‌యాలు మాత్రం నిలిచిపోయాయి. అవే ఒక‌టి స్థానిక ఎన్నిక‌లు కాగా, రెండు పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల పంపిణీ. ఈ రెండు విష‌యాల‌ను కూడా వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. పేద‌ల‌కు ఇళ్లు ఇవ్వాల‌న్ని అంశాన్ని సీఎం జ‌గ‌న్ చాలా తీవ్రంగా భావించారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇళ్లు ఇచ్చి తీరాల‌ని సంక‌ల్పించారు. కానీ, క‌రోనా కార‌ణంగా ఇది వాయిదా ప‌డిపోయింది. అదేస‌మ‌యంలో స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కూడా భావించారు.

ఒక వేళ రేపు క‌రోనా పెరిగి, గ్రామాల్లోను, మండ‌ల స్థాయిలోను చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తే.. స్థానికంగా స‌ర్పంచులు, ప్ర‌జాప్ర‌తినిధులు అందుబాటులో ఉంటార‌ని, ప్ర‌భుత్వంపై కొంత బ‌రువు త‌గ్గుతుంద‌ని అనుకున్నారు. అయితే, ఇది ముందుకుసాగ‌లేదు. దీంతో ఈ నెల రోజుల వ్య‌వ‌ధిలో ప్ర‌భుత్వ‌మే అన్నీ తానై వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో అన్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగి ఉంటే.. రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు. ప్ర‌భుత్వానికి కూడా బాగుండేద‌నే అభిప్రాయం వైసీపీ నేత‌ల నుంచి ప్ర‌ముఖంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news