ఎన్నికల్లో ఓడితే మగాడు కాదా?: కేటీఆర్

-

ఎన్నికల్లో ఓడితే మగాడు కాదా..? అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తాజాగా ఆయన కామారెడ్డి కార్యకర్తలతో మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచిన వాడే మగాడా..? ఓడిన వాడు మగాడు కాదా..? అని సీఎం రేవంత్ రెడ్డిని  కేటీఆర్ ప్రశ్నించారు. మల్కాజిగిరి నుంచి పోటీ చేద్దాం.. ఎవరు మగాడో తేల్చుకుందాం. నేను ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చాను. రేవంత్ ఆంధ్రా వాళ్ల బూట్లు నాకి, పార్టీలు మారి సీఎం అయ్యారని తెలిపారు.

ఇప్పటికైనా కారు కూతలు, చిల్లర మాటలు మానాలి అని సూచించారు. సీఎం లా హుందాగా వ్యవహరించాలి అన్నారు. హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ భరతం పడతాం అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టే.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మారని తెలిపారు కేటీఆర్.  గత అసెంబ్లీ ఎన్నికలను అస్సలు పట్టించుకోకూడదన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపించాలన్నారు. మార్చి 17కి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది.. అప్పుడు నిలదీస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news