ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ ను మించిన సంచలనం మరొకరు లేరు.తరువాత కూడా కేసీఆర్ ను ఢీ కొనే వారే లేరు.ఆ మాటకు వస్తే ఇవాళ్టికీ ఆయనకు ఆంధ్రాలో మంచి అభిమానులు ఉన్నారు.ముఖ్యంగా పవన్ అభిమానులు నిన్నటి వేళ విజయవాడలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సిలో కేసీఆర్ కనిపించారు.ఆయనపై పవన్ అభిమానులు పొగడ్తల వాన కురిపిస్తున్నారు. ఇవాళ సినిమాల విషయమై ఐదో షోకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ రేట్లు కూడా సవరించి ఆంధ్రా కన్నా మిన్నగా సీఎం కేసీఆర్ ఉన్నారని కొనియాడుతున్నారు.తమ పూర్తి మద్దతు కేసీఆర్ కు ముందున్న కాలంలోనూ ఉంటుందని పలువురు పవన్ అభిమానులు అంటున్నారు.ఇదే సమయంలో కేసీఆర్ కన్నా భిన్నంగా జగన్ వ్యవహరిస్తున్న వైనం ఇక్కడ అస్సలు మరువకూడదు.
ఆంధ్రాలో మాత్రం పరిణామాలు భిన్నంగా ఉన్నాయి.జగన్ చెప్పినా కూడా వైసీపీ అభిమానులు అదే పనిగా పవన్ పై ఫైర్ అవుతున్నారు.అదే పనిగా జనసేనతో వాగ్వాదాలు పెంచుకుంటున్నారు. దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఇటువంటి అనవసర వాగ్వాదాలు ప్రభావం చూపుతాయి అని జగన్ కూడా ఆందోళన చెందుతున్నారు.అందుకే ఏపీ మంత్రులకు కూడా కాస్త తగ్గి ఉండండి అనే చెబుతున్నారు జగన్. కానీ వీటిని వినిపించుకునే స్థితిలో లేరు మంత్రులు.దీంతో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మద్దతు పవన్ కు ఉంటుందని కూడా తేలిపోయింది.గతంలో మాదిరిగానే పవన్ కూడా అటు తెలంగాణ రాష్ట్ర సమితిపై ప్రేమపెంచుకుం టున్నారు.తనదైన మద్దతు కూడా ఇస్తున్నారు.
తెలంగాణలో సినిమా పరిశ్రమ మరింత ఎదిగేందుకు, ఇండియన్ సినిమాకు హబ్ గా హైద్రాబాద్ మారేందుకు ఊతం ఇచ్చేందుకు కూడా తనవంతు సాయం చేయనున్నారు.ఇవన్నీ జగన్ కు కోపం తెప్పించవచ్చు.అయినా సరే! పవన్ మాత్రం తన సినిమా విషయమై ఇంతగాఇబ్బందులు పెట్టిన ప్రభుత్వానికి తాను ఏ విధంగా సాయం చేయగలనని అంతర్మథనం చెందుతున్నారు.ఈ నేపథ్యంలో విజయవాడ కేంద్రంగానే కాదు శ్రీకాకుళం వరకు కూడా పవన్ అభిమానులు తమ మద్దతు కేసీఆర్ కే అంటున్నారు. కనీస స్థాయిలో కూడా తమ సినిమాకు సాయం చేయని వైసీపీ సర్కారు ఇకపై అయినా కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలని హితవు చెబుతున్నారు.