విశాఖలో ఆ ల్యాండ్ మార్క్ కి 50ఏళ్లు…!

-

ఏ నగరమైన, పట్టణమైన పేరు చెప్పగానే ఓ ల్యాండ్ మార్క్ గుర్తుకు వస్తుంది. అదే ల్యాండ్ మార్క్ ఓ సిటీకి.. 50ఏళ్లుగా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసిందంటే వినడానికి ఆసక్తికరంగా అనిపిస్తుంది. అదీ ఒక సినిమా హాలు కావడం మరో విశేషం. ఐదు దశాబ్దాల ఈ మధురమైన జ్ఞాపకం ఇప్పుడు విశాఖలో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. విశాఖపట్టణంలో నీలి రంగు సముద్ర సోయగం తర్వాత అందరినీ ఆకర్షించేది జగదాంబ సెంటర్. దశాబ్ద క్రితం వరకు పేపర్లు,రేడియోలు,టీవీల్లో వచ్చే వాణిజ్య ప్రకటనల్లో ఈ పేరు హోరెత్తిపోయేది. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు అతిపెద్ద వాణిజ్య కూడలి ఇదే. కోట్ల రూపాయల వ్యాపారాలు చేసే వ్యాపారాలు ఎన్ని ఉన్నా..పోర్ట్ సిటీ అంటే జగదాంబ…. జగదాంబ అంటే వైజాగ్ అనే ముద్రపడింది.

1970లో DOULBE సౌండ్ హంగులతో జనం ముందుకు వచ్చిన జగదాంబ…..సినిమా ప్రేమికులకు కొత్త అనుభూతిని అందించడం మొదలు పెట్టింది. మల్టీ ప్లెక్స్, సినిమా హాల్స్ కాంప్లెక్స్ ఆలోచన దశాబ్దాల క్రితమే చేసిన జగదాంబ యాజమాన్యం అందుకు తగ్గట్టుగానే సినీ లవర్స్ టెస్టుకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతూనే ఉంది. రమాదేవి, జగదాంబ,శారదా థియేటర్లు కలిపి ఉండగా ప్రస్తుతం ఐనాక్స్ లు, మల్టీ ప్లెక్స్ ల నుంచి వస్తున్న పోటీని తట్టుకుని సగర్వంగా నిలబడింది. విశాఖ సినిమాకు మధుర అనుభూతిగా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news