ముస్లింలకు జగన్ తీపికబురు చెప్పారు. ముస్లిం సంఘాల ప్రతినిధులతో సీఎం వైయస్.జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు ముస్లిం సంఘాల ప్రతినిధులు. వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చారు ముస్లిం సంఘాల ప్రతినిధులు.
ముస్లిం సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన అంశాల పై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్… కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్‌హౌస్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. విజయవాడలో హజ్‌హౌస్ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేసిన ముస్లిం సంఘాలు…హజ్‌హౌస్ నిర్మాణం కోసం అవసరమైన భూమి కేటాయించాలని అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. వక్ఫ్ బోర్డు ఆస్తుల రక్షణకై తగిన చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణకు హామీ ఇచ్చారు. అలాగే, ఖాజీల పదవీ కాలాన్ని మూడేళ్ల నుంచి పదేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సీఎం జగన్.. గ్రామ, వార్డు సచివాలయ స్ధాయిలో సులభతరమైన రెన్యువల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని అధికారులకు ఆదేశించారు.