గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో గుడ్న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఇవాళ్టి నుంచే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఉపయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్.
అయితే, ఈ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ.. చట్టం తీసుకురానున్నారు సీఎం జగన్. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు చట్టబద్ధత కల్పిస్తూ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశల్లోనే బిల్లు పెట్టాలనుకోవడం గొప్ప నిర్ణయం అన్నారు. ఏపీలో గ్రామ స్వరాజ్యానికి శాశ్వత ముద్ర. 1.35 లక్షల మంది ఉద్యోగులకు రక్ష ఉండనున్నట్లు తెలిపారు విజయ సాయిరెడ్డి.