ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 61 సిడిపిఓ పోస్టులను భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ ఈ మేరకు మాట్లాడుతూ, అంగన్వాడి కేంద్రాలలో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని వెల్లడించారు.
నాడు నేడు కింద చేపడుతున్న పనులను షరా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలలో నాణ్యత పెరగాలని సూచించారు. కరి కులం కూడా మారాలని, పాఠ్య ప్రణాళిక కోసం అవసరమైతే ప్రత్యేక అధికారి నియమించాలని స్పష్టం చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. కొత్తగా నియమించిన సూపర్వైజర్ల సహాయంతో అంగన్వాడీ కేంద్రాలలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని అలాగే సూపర్వైజర్ సిస్టం ద్వారా అంగన్వాడీల నాణ్యత పెరుగుతుందని పేర్కొన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.