విద్యాశాఖపై క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రతి క్లాసులోనూ డిజిటల్ బోధనకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇంటరాక్టివ్ డిస్‌ప్లే లేదా ప్రొజెక్టర్లతో ప్రభుత్వ బడిపిల్లలకు మరింత విజ్ఞానం పెరుగుతుందన్న సీఎం…ఖాళీల భర్తీపై కీలక ఆదేశాలు జారీ చేశారు. డీఈఓ, ఎంఈఓ సహా వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ బాధ్యతలున్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని.. ఎస్‌సీఈఆర్టీ, డైట్ సీనియర్ లెక్చరర్స్, డైట్ లెక్చరర్స్ పోస్టుల భర్తీ పైనా దృష్టి పెట్టాలని జగన్ పేర్కొన్నారు.
రెండో దశ నాడు–నేడు పనులను వేగవంతం చేయాలి… స్కూళ్లలో విలువైన ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నందున భద్రత దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై ఆలోచన చేయాలని.. టాయిలెట్ మెయిన్టెన్స్, స్కూల్ మెయిన్టెన్స్ ఫండ్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. పీపీ –1 నుంచి రెండో తరగతి వరకూ స్మార్ట్ టీవీలు, 3వ తరగతి ఆపైన ప్రొజెక్టర్లు పెట్టేలా ఆలోచన చేయాలన్నారు.