మూడో మార్గం: సచిన్ కు జగన్ ఆన్ లైన్ క్లాస్ రిక్వైర్మెంట్!

-

అనేక రసవత్తర ఘట్టాల అనంతరం రాజస్తాన్‌ రాజకీయం మరో మలుపు తిరిగింది. రాజస్థాన్ కాంగ్రెస్ లోని తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్ ‌కు కాంగ్రెస్‌ అధిష్టానం పెద్ద షాకే ఇచ్చిందని చెప్పుకోవాలి! రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ స్వయంగా పైలట్ ‌తో మాట్లాడి తిరుగుబాటు నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరినా.. వారి అభ్యర్థనలను తోసిపుచ్చిన పైలట్… రెండో సారి నిర్వహించిన సీఎల్పీ భేటీకి హాజరుకాలేదు! దీంతో వేటు తప్పదని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ.

ఇందులో భాగంగా… పైలట్‌ ను రాజస్తాన్‌ ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి, పీసీసీ చీఫ్‌ పదవి నుంచి తొలగించడంతోపాటు.. సచిన్ ‌కు అత్యంత సన్నిహితులైన విశ్వేంద్ర సింగ్, రమేశ్‌ మీనాలను కూడా మంత్రి పదవుల నుంచి తప్పించింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేది సచిన్ ముందున్న పెద్ద ప్రశ్న! రాజీపడి కాంగ్రెస్ తోనే జతకడతారా..? ఈయన అనుకున్నా వారు రానివ్వకపోవచ్చు! ఈపూటకు గడిపేద్దాం అని కాషాయం రంగు పూసుకుంటారా..? రాజకీయ భవిష్యత్తు అందకారం అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి! మరి సచిన్ ముందున్న ఆప్షన్ ఏమిటి?

ఇలాంటప్పుడే సచిన్ పైలట్ కు జగన్ నుంచి ఆన్ లైన్ క్లాసుల రిక్వైర్మెంట్ ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. తన ధమ్మేంటో, తన సత్త ఏమిటో, తనపై ప్రజలకున్న నమ్మకం ఏమిటనేది.. తనకంటే బాగా ఎవ్వరికీ తెలియదు! కాబట్టి ఆ బలాబలాను ఒకసారి స్వీయ విశ్లేషణ చేసుకుని… కాంగ్రెస్ పార్టీ విషయంలో వెనక్కి తగ్గడమా.. బీజేపీతో రాజీపడి బ్రతికేయడమా.. ఆ రెండు ఆప్షన్స్ ని కాదని “జగన్ ను ఆదర్శంగా తీసుకుని” సొంత కుంపటిపెట్టి తనను తాను నిరూపించుకోవడమా?

ఈ సమయంలో ఈపూటకు గడిచిపోతే చాలు అనుకునే ధోరణి విడనాడి.. జగన్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకువెళ్లడమే సచిన్ కు మంచిది అనేది చాలా మంది చెబుతున్న మాట. చిన్న వయసులోనే సచిన్ కు రావాల్సినంత పేరు వచ్చింది కాబట్టి… వ్యక్తిగతంగా, సొంతగా, తనను తాను నిరూపించుకునే అవకాశంగానే ఈ తాజా రాజకీయ పరిణామాలను అర్ధం చేసుకుని, తనకు అనుకూలంగా మార్చుకుని ముందుకువెళ్లడం మంచిది!! ఈ విషయంలో “శత్రువు శత్రువు మిత్రుడు” అనే లాజిక్ జగన్ ఫిక్సయితే… జగన్ నుంచి ఆన్ లైన్ క్లాసులు పొందే సదుపాయం సచిన్ కి ఉండొచ్చు అని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news