ఏపీ ప్రజలకు శుభవార్త. ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీకి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జోరుగా సాగుతున్న లే అవుట్ పనులు కొనసాగిస్తోంది. ఇక ఇవాళ లే అవుట్ పనుల పురోగతిని పరిశీలించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. ఈ నెల 26న ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఇళ్ళ పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల మాట్లాడారు. లే అవుట్ల అభివృద్ధి వేగంగా జరుగుతోంది.. ప్రైవేటు లే అవుట్లు కూడా ఇంత చక్కగా ఉండవని తెలిపారు. లే అవుట్లలో 62 శాతం రోడ్లు, ఓపెన్ స్పేస్ గా వదిలామని వివరించారు. ఇంటర్నల్ రోడ్ల కోసం 36 శాతం భూమి కేటాయించామని.. స్లమ్స్ అని ఎలా అంటారు?? అని పేర్కొన్నారు. మొత్తం స్థలంలో 38 శాతం మాత్రమే ప్లాటింగ్ చేశామన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల.