తెలంగాణ సీఎస్ సోమేష్ కుమారుకు జగన్‌ సర్కార్‌ లేఖ

-

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమారుకు ఏపీ సీఎస్ సమీర్ శర్మ లేఖ రాశారు. ఉద్యోగుల అంతరాష్ట్ర బదిలీలపై తెలంగాణ సీఎస్సుకు ఏపీ సీఎస్ లేఖ రాశారు. తెలంగాణ నుంచి ఏపీకి, ఏపీ నుంచి తెలంగాణకు శాశ్వత ప్రతిపాదికన బదిలీ కావడానికి కొందరు ఉద్యోగులు సిద్దంగా ఉన్నారని.. ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ కావాలని కోరుకునే ఉద్యోగులు 1808 మంది ఉన్నారని లేఖలో పేర్కొంది ఏపీ సర్కార్‌.

తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ కావాలని కోరుకునే ఉద్యోగులు 1369 మంది ఉన్నారు… ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అవ్వాలనుకునే వారికి ఎన్ఓసీ ఇవ్వడానికి ఏపీ నిర్ణయించిందని తెలిపారు. ఏపీ తరహాలో కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఎన్ఓసీ ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామని.. రాష్ట్ర విభజన అనేది ఊహించని సంఘటన అన్నారు.

విభజన ఉద్యోగుల పని-జీవిత సమతుల్యతను ప్రభావితం చేసి.. వారి జీవితాలను, వృత్తిని ప్రభావితం చేసింది… వైద్యం, భార్యాభర్తల ఉద్యోగం, పిల్లల చదువులు, సొంతిల్లు వంటి అనేక కారణాల వల్ల నిర్దిష్ట రాష్ట్రంలో ఉండాలనుకునే చాలా మంది ఉద్యోగులు అసంతృప్తి మరియు నిస్పృహకు లోనవుతున్నారని తెలిపారు. ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీల విషయంలో వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని లేఖలో వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news