వైఎస్ కు హిందూ సాంప్రదాయం ప్రకారమే జగన్ పిండ ప్రదానం : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

-

దివంగత ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోతే  జగన్  హిందూ సాంప్రదాయం ప్రకారమే పిండ ప్రదానం చేశారని  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. 3680 కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. 3680 మెట్లు ఎక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు జగన్ మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి దేవుడంటే భక్తి భావన ఎక్కువ. రాజకీయాల కోసం మతాల,కులాల మద్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. టిటిడి లో పని చేసే అర్చకులకు మీ రాశి వ్యవస్థను మళ్ళీ కొనసాగించారు.

అర్చకులకు, లడ్డు తయ్యారు చేసే బ్రాహ్మణులకు జీతాలు పెంచారు. టిటిడి నిధులతో ఎన్నో ఆలయాలు నిర్మించారు.  పురాతన ఆలయాలకు జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చెపట్టారు. ఇంట్లోనే గోశాలను నిర్మించుకొని, గోవులకు పూజాలు నిర్వవహిస్తున్నాడు. అదే గోవుకు పుట్టిన దూడకు మహా లక్ష్మి అనే నామకరణం చేశారు. అలాంటి వ్యక్తి ని తిరుమల పర్యటనకు వస్తుంటే అడ్డుకుంటున్నారు. నోటిసులు ఇచ్చారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తే దేవుడు కూడా క్షమించడు అని దుయ్యబట్టారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news