జనసేనకు ప్రత్యేకం: తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇది!!

టాలీవుడ్ లో పవన్ కల్యాణ్… పవర్ స్టార్! డైరెక్టర్ ఎవరైనా, హీరోయిన్ మరెవరైనా, విలన్స్ ఇంకెవరైనా… క్యాస్టింగ్ తో సంబంధం లేదు.. భారీ భారీ ఫైట్స్, సెట్స్ అవసరం లేదు… పోస్టర్ పై పవన్ కనిపిస్తే టిక్కెట్లు వాటికవే చిరిగిపోతాయి! తెరపైన పవన్ కనిపిస్తే.. వెండితెర దానికదే వెలిగిపోతుంది!! ఈ మాటలు కాసేపు పక్కనపెట్టి… జనసేన అధినేత పవన్ గురించి మాట్లాడుకుందాం.. ఆ పార్టీ గురించి చర్చించుకుందాం!

జనసేనలో నెంబర్ 1 ఎవరు? అదేమి ప్రశ్న… పవన్ కల్యాణ్! నెంబర్ 2 ఎవరు? అదేం ప్రశ్న… పవన్ కల్యాణ్! నెంబర్ 3 ఎవరు… మళ్లీ అదే ప్రశ్న… పవన్ కల్యాణ్! జనసేన తరుపున ఏదైనా విషయాలపై ఎవరైనా మాట్లాడాలంటే? ఇంకెవరు.. పవన్ కల్యాణ్! ధర్నాలు గట్రా చేయాలంటే? ఇంకెవరు.. పవన్ కల్యాణ్! పార్టీ తరుపున ట్రంప్ కార్డు ఎవరు?.. పవన్ కల్యాణ్! పార్టీలో మాస్ లీడర్ ఎవరు… పవన్ కల్యాణ్! పార్టీలో క్లాస్ లీడర్ ఎవరు… పవన్ కల్యాణ్!

ఇది కరెక్ట్ కాదు అని అంటున్నారు విశ్లేషకులు! సినిమాను ఒక వ్యక్తిపేరు చెప్పి ఆడించొచ్చేమో కానీ… పార్టీని మాత్రం పరిగెత్తించలేమని అంటున్నారు రాజకీయ పండితులు! ప్రశ్నించడానికని రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పుకునే పవన్ ప్రశ్నించి చాలాకాలమే అయ్యింది! పోని జనసేన తరుపున మరికొంతమంది దూకుడున్న నేతలు ఉండి వారైనా ప్రశ్నిస్తారనుకుంటే… “నేను స్పందిస్తేనే అది అధికారిక స్పందన” అన్న రేంజ్ లో పవన్ గతంలో నాగబాబు విషయంలో క్లారిటీ ఇచ్చేశారు!

వైకాపా, టీడీపీ, బీజేపీలకు ఆ సమస్య లేదు!! క్లాస్ విషయాలు మాట్లాడేవారు క్లాస్ విషయాలకు… మాస్ దంపుడు ఉపన్యాశాలు ఇచ్చేవారు మాస్ వ్యవహారాలకు పుష్కలంగా ఉన్నారు! సామాజికవర్గాల వారీగా, ప్రాంతాలవారిగా, మతాల వారీగా… ఆయా ప్రజల సమస్యలను ప్రస్థవించడానికి, మనోభావాలు వ్యక్తపరచడానికి నేతలు వున్నారు. మరి జనసేనకేరి?? రాబోయే మూడేళ్లలో అయినా పవన్ ఈ దిశగా ఆలోచించుకోనిపక్షంలో… ఆటలో అరటిపండే!!

ఎందుకంటే… 2024 ఎన్నికలు అన్నిపార్టీలకూ చాలా కీలకం! గెలుపోటములు ప్రస్తుతానికి వైకాపా – టీడీపీలకు మాత్రమే కీలకం కావొచ్చు. మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే… ఇక ఇప్పట్లో జగన్ కుర్చీ దిగే పరిస్థితి లేదు! టీడీపీ కనిపించే పరిస్థితీ లేదు!! ఈ సమయంలో బీజేపీ సంగతి కాసేపు పక్కనపెడితే… ఎంత మిత్రపక్షం అయినా జనసేన కు కూడా ప్రత్యేకంగా తమ మార్కు సీట్లు కొన్నైనా రాకపోతే మాత్రం… ఆ మాటలు ఎందుకులే… పవన్ ఆలోచనకే వదిలేద్దాం!!

-CH Raja