చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం అగరమంగలం లోని ఈశ్వర ఆలయంలో నిన్న నంది విగ్రహం ధ్వంసం అయినట్టు వెలుగులోకి వచ్చింది. మొన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు విగ్రహాన్ని రెండుగా ధ్వంసం చేశారు. ఇటీవల కాలంలో హిందూ ఆలయాలల్లో అనేక రకాల దాడుల నేపద్యంలో నంది విగ్రహం ధ్వంసం కావడంతో హిందూ వాదుల్లో మరింత ఆందోళన నెలకొంది. అయితే ఈ కేసులో టీడీపీని ఇరికించాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్నా రని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మొత్తం 30 మంది ప్రమేయంతో ఈ సంఘటన జరిగిందని చెబుతూ పోలీసులు టీడీపీ వారిని స్టేషన్ కు తీసుకు వచ్చి వేధించడం బాధాకరమని టీడీపీ నేతలు అంటున్నారు. ఎస్పీ, డిఎస్పీ లు కలిసి గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్లో 3 గంటలుకు పైగా విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేశారని, ప్రభుత్వ ఆదేశాలు మేరకు పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారని టిడిపి నేతలు వాపోతున్నారు .ఇలా తప్పుడు కేసులను టిడిపి పైన పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. పథకం ప్రకారం ఐ అండ్ పీఆర్ వాట్సాప్ గ్రూపు లో టిడిపి ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు, పోలీసుల రహస్య విచారణ చేస్తున్నారని సోషల్ మీడియాలోకి తప్పుడు ప్రచారం పంపించడం మీద టిడిపి నేతలు మండిపడుతున్నారు.